* డిప్యూటీ సీఎం భట్టి
ఆకేరు న్యూస్ ,హైదరాబాద్:సింగరేణి కాలరీస్ వ్యవహారాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణ జరిపించాలనుకోవడాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వాగతించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలను ఆయన ప్రస్తావిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.సింగరేణి సంస్థకు దాదాపు 105 ఏళ్ల ఘన చరిత్ర ఉందని, ఈ సంస్థలో జరిగే అంతర్గత నిర్ణయాలు అన్నీ మంత్రి స్థాయికి రావని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం విచారణ చేపట్టడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. 2018లోనే కోల్ ఇండియా టెండర్ డాక్యుమెంట్లను పంపిందని, అందులో ‘సైట్ విజిట్’ తప్పనిసరి అని CMPDI డాక్యుమెంట్లు పేర్కొన్నాయని గుర్తు చేశారు. 2021, 2023 సంవత్సరాల్లో కోల్ ఇండియా, NMDC పంపిన పత్రాల్లో కూడా సైట్ విజిట్ ఉందని, ఆ సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విచారణ ద్వారా అప్పట్లో ఏం జరిగిందో ప్రజలకు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
………………………………………………….
