
* కాటాపూర్ లో రోడ్డు పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురం గ్రామంలో పలు రకాల అభివృద్ధి పనులకు ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ప్రారంభోత్సవం చేశారు. ఇందులో భాగంగా పద్మశాలి సంఘంకు 10 లక్షల రూపాయలతో మంజూరు అయిన కమ్యూనిటీ హాల్ , ఎల్లమ్మ దేవాలయం ప్రహరీ గోడ, గ్రామంలోని పలు సిసి రోడ్లు ప్రారంభించారు.అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో రేగ కళ్యాణి మాట్లాడుతూ ములుగు జిల్లాలో ప్రతి మండలంలో ఆరు కోట్లకు పైగా నిధులతో అంతర్గత సీసీ రోడ్లు, ములుగు మున్సిపాలిటీ, ఏటూరునాగారం డివిజన్, మల్లంపల్లి మండలం, జిల్లా కేంద్రంలో అధునాతన బస్టాండ్, ఏటూరునాగారంలో బస్ డిపో, ములుగులో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ, ప్రతి మండల కేంద్రంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం, వరదల వలన నష్టపోయిన వంతెనల నిర్మాణం లాంటి పనులతో ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మంత్రి సితక్క ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ, ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు. కొందరు అభివృద్ధిని ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారని విమర్శించడం మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోల్లు దేవేందర్ ముదిరాజ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి మధు, మండల యూత్ అధ్యక్షులు కోడి సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగరం చిరంజీవి, ఎండి. ముజఫర్, మాజీ సర్పంచులు బెజ్జూరి శ్రీనివాస్, మంకిడి నరసింహస్వామి, నర్సయ్య, మార్కెట్ కమిటి పాలకవర్గ సభ్యులు ముక్తి రామస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్తినేని లక్ష్మయ్య, మద్దూరి రాములు, మద్దూరి రాజు, కమ్మ శ్రీను, గౌడ సంఘం సభ్యులు పులి నరసయ్య, బెల్లంకొండ రోశయ్య, గడ్డం శ్రీధర్, గుండు సదయ్య, తడక రమేష్, పులి రవి, పాలకుర్తి మధు, రంగు రాజు, పద్మశాలి సంఘం సభ్యులు గడల సారయ్య, పల్నాటి సత్య, కూచన సురేష్, కందకట్ల సాంబయ్య, వంగరి సదానందం, నేతాని రామ్మోహన్, బాసాని ముకుందం, ఆటో రామారావు, ఉప్పల శివ, శరత్, భరత్, అబ్బు పుల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
…………………………………………