* బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం
* రేపే ప్రమాణం..
ఆకేరున్యూస్, మహారాష్ట్ర: మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడిరది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌నే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. బుధవారం ఉదయం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో.. సీఎంగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించారు. రేపు ముంబై ఆజాద్ మైదాన్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. సీఎంతోపాటు ఇద్దరు ఉపముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. అజిత్ పవార్‌తో పాటు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. కాగా, మహాయుతి నేతలు బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నట్లు సమాచారం.
…………………………………