*మున్సిపల్ ఎన్నికలకు పోలీసు శాఖ సిద్ధం- డీజీపీ శివధర్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్ మినహాయించి రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు 142 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తెలిపారు. తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు సుమారు రూ. 3 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
