* వార్షిక నివేదిక విడుదల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో 2024లో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించి డీజీపీ జితేందర్ (DGP JITENDER)వార్షిక నివేదిక విడుదల చేశారు. ఈ ఏడాదిలో 2,34,158 కేసులు నమోదయ్యాయని వివరించారు. తెలంగాణను జీరో డ్రగ్ స్టేట్ గా నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఏడాదిలో 48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్షపడేలా చేసినట్లు తెలిపారు. 1950 గంజాయి కేసులు నమోదయ్యాయని వివరించారు. 20 గన్నుల గంజాయి సీజ్ చేశామని, వాటి విలువ రూ. 142 కోట్లు అని తెలిపారు. మైనర్ ఘటనలు మినహా శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని వివరించారు.
85 మంది మావోయిస్టుల అరెస్ట్
ఏడాదిలో 85 మంది మావోయిస్టు(MOAIST)లను అరెస్ట్ చేశామని జితేందర్ వివరించారు. అమాయక ప్రజలను మావోయిస్టులు హతమార్చారని, అందువల్ల తాము కూంబింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. పారదర్శకంగా శాంతిభద్రతలను కాపాడామన్నారు. తెలంగాణలో మతపరమైన కమ్యూనల్ కేసులు లేవని తెలిపారు. ఈ ఏడాది సైబర్ క్రైం బాగా పెరిగిందన్నారు. దేశంలో తొలిసారి 2.42 కోట్లు సైబర్ నేరగాళ్ల నుంచి విడిపించినట్లు వెల్లడించారు. 10 వేల ఐఎంఈఐ(IMEI) నంబర్లను బ్లాక్ చేశామన్నారు.
…………………………………………