* భార్యాపిల్లల పరిస్థితి విషమం
* ఆర్థిక ఇబ్బందులకు తోడు.. ఆన్లైన్ బెట్టింగ్ లే కారణం
ఆకేరు న్యూస్, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలకుంట కాలనీలోని విషాదం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నించాడు. భార్యాపిల్లలకు విషం ఇచ్చి.. తాను ఉరేసుకున్నాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి (Constable Suicide) చెందగా, భార్యాపిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా కేంద్రంలోని కలకుంట కాలనీ(kalakunta colony)లో 17వ బెటాలియన్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ.. భార్యకు నీళ్లలో ఎలుకల మందు, పిల్లలకు పాలల్లో పురుగుల మందు కలిపి ఇచ్చిన అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆయన మృతిచెందగా, భార్యా పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆర్థిక ఇబ్బందులకు తోడు.. ఆన్లైన్ బెట్టింగ్(online betting) లే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద మరో కానిస్టేబుల్ ఆత్మహత్య
మెదక్ జిల్లాలో కొల్చారం పోలీస్ స్టేషన్ వ ద్ద మరో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొల్చారం పోలీస్ స్టేషన్(Kolcharam Policestarion)లో సాయి కృష్ణ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున వాకింగ్ కోసం పీస్ వద్దకు వచ్చిన ఆయన అక్కడున్న చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారు. అంతకు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తున్నది. తరచూ చనిపోతానని సాయికుమార్ అనేవారని ఆయన భార్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
