
* మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 27కు చేరింది. బంగ్లా వాయు సేనకు చెందిన శిక్షణ విమానం ఎఫ్ 7 బీజీఐ యుద్ధవిమానం సాధారణ శిక్షణలో భాగంగా కుర్మిటోలాలోని ఖండేర్కర్ వైమానిక స్థావరం నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు టేకాఫ్ అయింది.టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే అది బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ పాఠశాల భవనంపై కూలింది. దీంతో భారీ ఎత్తున పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు పైలెట్ ఫ్లైట్లెఫ్టినెంట్ మహ్మద్ తౌకీర్ ఇస్లాం తో సహా 27 మంది చనిపోయారు.విమానం పాఠశాల బిల్డింగ్ పై పడడంతో 171 మంది గాయపడ్డారు. అందులో 88 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారు.గాయపడి చికిత్స పొందుతున్న వారిలో 48 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
……………………………………….