
* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ధర్మరక్షకులు దాడులు చేస్తారు, రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రంగరాజన్‌పై దాడిపై హిందూ ధర్మ పరిరక్షకులు ఇప్పటివరకు ఒక్కమాటా మాట్లాడలేదని కేటీఆర్ విమర్శించారు. దాడి ఘటనపై వీడియోలున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి, హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
………………………………..