
* హత్య చేశారా..?
* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలకలం
* యువతి మృతిపై అనుమానాలు
ఆకేరు న్యూస్, వరంగల్ : కొద్ది రోజుల క్రితం ఆ యువతి అదృశ్యమైంది. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆమె శవమై కనిపించింది. మృతదేహం పక్కన పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పూజసామగ్రి లభ్యం కావడంతో క్షుద్రపూజలు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితెలా గ్రామానికి చెందిన కప్పల వర్షిని (22) ఈ నెల6న ఇంట్లో నుంచి బయటికి వెళ్లి కనిపించ లేదు. దీంతో తల్లి చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఓ చోట యువతి మృతదేహం ఉందన్న సమాచారం అందింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం- భూపాలపల్లి జాతీయ రహదారి పక్కనే మేడిపల్లి అటవీ ప్రాంత సమీపంలో డెడ్ బాడీ ఉంది. ఆ ప్రాంతంలో వెళుతున్న పశువుల కాపర్లు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.. అక్కడ వెళ్లి చూడగా ఆమెను వర్ణిణిగా గుర్తించారు. అయితే మృతదేహం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉండడంతో క్షుద్రపూజలు చేసి చంపినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చింది.. ఎవరైనా హత్య చేశారా…? బలవన్మరణానికి పాల్పడిందా అనే కోణాల్లోనూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………