
*నగ్నంగా 9 గంటలు..!
*వెలుగులోకి వచ్చిన సైబర్ మోసం
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆధునిక టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో అంతే వేగంగా టెక్నాలజీ సహాయంతో చేసే మోసాలూ పెరుగుతున్నాయి. ఓ సైబర్ నేరస్థుడు తన తెలివితేటలను ఉపయోగించి ఇద్దరు మహిళలను దారుణంగా మోసం చేసిన ఘటన బెంగుళూరులో వెలుగులోకి వచ్చింది. థాయ్ లాండ్ కు చెందిన ఓ మహిళ బెంగళూరు లో ఉన్న తన స్నేహితురాలిని కలవడానికి జులై 17న బెంగుళూరుకు వచ్చింది. ఈ నేపధ్యంలో ఆ మహిళకు అపరిచిత నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని పరిచయం చేసుకొని జెట్ ఎయిర్ వేస్ కు చెందిన అక్రమ నగదు బదిలీలో మీరు పాల్గొన్నారని వెంటనే పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా బెదిరించాడు. తాను చాలా సంవత్సరాలుగా భారత్లో లేనని ఆమె వివరించినప్పటికీ, నేరగాడు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. చివరకు ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ. 58,477 బదిలీ చేయించుకున్నాడు. డబ్బు బదిలీ చేయించుకున్న తర్వాత కూడా అతడు ఆగలేదు. బాధితురాలు, ఆమె స్నేహితురాలిని వాట్సాప్ వీడియో కాల్లోకి రమ్మని చెప్పి. “గుర్తింపు కోసం పుట్టుమచ్చలు చూడాలి” అని చెప్పి, ఇద్దరినీ నగ్నంగా మారమని బెదిరించాడు. సుమారు 9 గంటల పాటు ఈ ఇద్దరు మహిళలను బెదిరంచాడు. చివరకు బాధిత మహిళలు ధైర్యం చేసి ఫోన్ను ఆఫ్ చేశారు. కొంత సమయం తర్వాత తాము మోసపోయామని గ్రహించిన బాధితులు, బెంగళూరు తూర్పు విభాగం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………