* ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారుతుంది
* కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
* సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు
ఆకేరున్యూస్, న్యూఢల్లీి: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు అవసరమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉపయోగిస్తున్న ఈవీఎంలపై కూడా పలు అనుమానాలు ఉన్నాయన్నారు. శుక్రవారం ఢల్లీిలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగలడంపై కాంగ్రెస్ లోతుగా విశ్లేషిస్తోంది. పార్టీలో కలిసికట్టుగా పోరాడకుండా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే ప్రత్యర్థులను ఎలా ఓడిరచగలం? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు కచ్చితంగా ఏడాది ముందు నుంచే సిద్ధం కావాలి. కాంగ్రెస్ కచ్చితంగా ఎన్నికల వ్యూహాన్ని మెరుగుపరుచుకోవాలని.. క్యాంపెయిన్‌ను మెరుగుపరిచేందుకు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి మెరుగైన మార్గాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.
……………………………………………….