* 18మందిపై చర్యలకు ఛైర్మన్ ఆదేశాలు
ఆకేరున్యూస్, తిరుమల: హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది. విధుల్లో ఉన్నప్పుడు హిందూయేతర మత ఆచారాలు పాటించిన వారిపై చర్యలకు తితిదే సిద్ధమైంది. 1989 ఎండోమెంట్ యాక్ట్ 1060 మేరకు హిందూమత సంప్రదాయాలను అనుసరిస్తామని ప్రమాణం చేసి తితిదేలో ఉద్యోగం పొందిన కొందరు అన్యమతాలను అనుసరిస్తున్నట్లు గుర్తించారు. 18 మందిపై క్రమశిక్షణ చర్యలకు తితిదే ఆదేశాలు జారీ చేసింది. హిందూయేతర ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీఆర్ఎస్ తీసుకునే వారికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచనలతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతేడాది నవంబరు 18న తితిదే బోర్డు సమావేశంలో చేసిన తీర్మానం మేరకు చర్యలు తీసున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
…………………………………..