
* రేపు విచారిస్తామన్న హైకోర్టు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గచ్చిబౌలి భూములపై హైకోర్టు(High Court)లో పిటిషన్ నమోదైంది. వట ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అత్యవసర పిటిషన్‌గా స్వీకరించాలని వట ఫౌండేషన్ (Vata Foundation) లాయర్ విన్నవించారు. రేపు విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు భూముల వేలానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వర్సిటీ గేటు బయట ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
…………………………………..