
ఆకేరు న్యూస్, కమలాపూర్ : మోదీ గిఫ్ట్ పేరిట కమలాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు గురువారం సైకిళ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ..మోదీ గిఫ్ట్’ పేరుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఉచితంగా 20వేల సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.మండల వ్యాప్తంగా కమలాపూర్ బాలుర,బాలికల పాఠశాలలో 68,పిఎం శ్రీ మోడల్ స్కూల్ లో 57,మర్రిపెల్లి గూడెం లో 23 మొత్తం 148 సైకిల్ లను పంపిణీ చేసినట్టు తెలిపారు. రాబోవు రోజుల్లో మిగతా పాఠశాలలో కూడా సైకిల్ ల పంపిణీ జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కట్కూరి అశోక్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు,మండల నాయకులు పెండ్యాల ప్రభాకర్ రెడ్డి,నాసానీ రాజు,పుస్కూరి రాంబాబు,బూత్ అధ్యక్షులు శనిగరపు సంపత్,మార్గం చైతన్య తదితరులు పాల్గొన్నారు.
………………………….