సోషల్ మీడియాలో వైరల్
ఆకేరు న్యూస్, డెస్క్ :
హిడ్మా.. దండకారణ్యంలో కీలక నేత. భారీ దాడులతో మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన నేతగా పేరుంది. ఆయన దాడులకు ఫ్లాన్ చేస్తే బారీ మూల్యం తప్పదనే ప్రచారం ఉంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో కన్నుమూశాడు.. దీంతో హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బే అని చెప్పొచ్చు. ఆ స్థాయి నేతల్లో మరో కీలకమైన మావోయిస్టు నాయకుడి పేరు తెరపైకి వచ్చింది. హిడ్మా స్థానాన్ని మావోయిస్టు పార్టీ కీలక నేత, టాప్ కమాండర్‌గా కొనసాగుతున్న బర్సీ దేవా భర్తీ చేయబోతున్నారంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇద్దరి నాయకులదీ.. సుక్మా జిల్లా పూవర్తే. బర్సీ దేవా 30 ఏళ్లకు పైగా దళంలో కొనసాగుతున్నారు. హిడ్మాతో కలిసి అనేక దాడులు చేసినట్లు సమాచారం. పోలీసులు, మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు.
