* అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు
* రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖుల హాజరు
* భూటాన్ రాజు జిగ్మే వాంగ్ చుక్ నివాళి
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన మేధస్సుతో దేశానికి దిశా నిర్దేశం మహా నేత, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) దివికేగారు. అధికారిక లాంఛనాలతో దేశం తుది వీడ్కోలు పలికింది. ఢిల్లీ(Delhi)లోని నిగమ్బోధ్ ఘాట్లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకు ముందు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము(Murmu), ఉపరాష్ట్రపతి ధన్ కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla), త్రివిధ దళాధిపతులు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendramodi), రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్, హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ కర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్దా రామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanthreddy), భూటాన్ రాజు జిగ్మే వాంగ్ చుక్ తదితరులు మన్మోహన్కు నివాళి అర్పించారు. త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. దేశం ఒక గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని పార్టీలకు అతీతంగా అందరూ నివాళులు అర్పించారు.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
