
* ఢిల్లీ హైకోర్టు తీర్పు
ఆకేరు న్యూస్ డెస్క్ : సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) ఇటీవల తన పర్సనాలిటీ హక్కులు (Personality Rights) రక్షించుకోవాలనే ఉద్దేశంతో నాగార్జున ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు . తన పేరు, ఫోటో, స్వరం లేదా రూపాన్ని తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని ఆయన పిటీషన్లో కోరారు. నాగార్జున పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కారియా, వ్యక్తిగత హక్కుల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత హక్కులు, వినియోగదారుల హక్కులు, డిజిటల్ వాణిజ్య స్వేచ్ఛ ల మధ్య సమతుల్యం అవసరమని స్పష్టం చేశారు. తరువాత కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. నాగార్జున అనుమతి లేకుండా ఆయన పేరు, స్వరం, రూపం వాణిజ్య ప్రకటనలకు వాడకూడదని ఆదేశించింది. ముఖ్యంగా ఏఐ, జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టంచేసింది.
………………………………