* జైల్లో పెడితే హ్యాపీగా యోగా చేసుకుంటా..
* కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: జైలుకు వెళ్లేందుకు నాకు అభ్యంతరం ఏం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జైల్లో పెడితే హ్యాపీగా యోగా చేసుకుంటానన్నారు. నా మీద ఎందుకు కేసులు పెడుతావ్.. హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుకా..? అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా-ఈ రేస్ విషయంలో మీడియాకు చెప్పిందే.. అక్కడ చెబుతా. గవర్నమెంట్‌గా నిర్ణయం తీసుకున్నానని చెబుతాను. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాను. నా మీద కేసులు ఎందుకు పెడుతావ్.. హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుకా..? లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా..? ప్రపంచపటంలో హైదరాబాద్‌ను నిలబెట్టినందుకా..? బెంగళూరును దాటి హైదరాబాద్‌లో ఐటీ ఎగుమతులు పెంచినందుకా..? పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుకా..? దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్‌గా మార్చినందుకా..? కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసినందుకా..? ఎందుకు కేసులు పెడతావని రేవంత్ రెడ్డిని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా విడిచిపెట్టమన్నారు.
…………………………………………..