ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో దొడ్డి కొమురయ్య జయంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. లంబ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, పండ్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శతబోయిన రాజు, బిజెపి చిల్పూర్ మండల అధ్యక్షులు గంటె ఉపేందర్ కాషాయ్య, శ్రీనివాస్, సంపత్, నాగరాజు, రాజేందర్, సాయి, రఘుపతి, శివ, రాములు, పండు, చింటూ, నర్సయ్య యువకులు, పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
