ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో ఆదివారం ‘ఈస్టర్’ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో అన్ని కులాలు, మతాలతో సర్వమత సమ్మేళనంగా నిర్వహించడం అభినందనీయం. ఆర్ సి ఎం చర్చ్ ఫాదర్ నవీన్ ఆధ్వర్యంలో సంఘ పెద్దలు ఆరూరి యాదగిరి, పాశం రఘుల పర్యవేక్షణలో జరిగిన ఈస్టర్ విందును సర్పంచ్ ఎస్.రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆరూరి మదన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వంగాల భాస్కర్ రెడ్డి, నాయకులు ఆరూరి కరణ్, పాశం రంజిత్, ఆరూరి కోరినల్, పాశం మధు, పాశం చిరంజీవి, ఆరూరి ప్రేమ్, అశోక్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈస్టర్ విందులో దాదాపు 400 మంది సహపంక్తి భోజనాలు చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
