* అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
* బ్రాహ్మణపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు ః ఇళ్లు రాని వారు ఎవరూ అధైర్య పడొద్దని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని మంత్రి సీతక్క అన్నారు. మంగపేట మండలం బ్రాహ్మణపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ, నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎం పి బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి షబరిష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని,ఎవరు అధైర్య పడవద్దని సూచించారు. అలాగే పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు.
ఉచిత వైద్య శిబిరం సందర్శన..

మల్లూరు లో ప్రస్తుత వర్షాకాల సీజన్ ను పురస్కరించుకొని ముందస్తు జాగ్రత్తలు భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యాధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమములో ప్రజా ప్రతినిధులు, జిల్లా,మండల స్థాయి అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
