
నీట్ రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనలు.. విచారణ గురువారానికి వాయిదా
* పహల్గామ్ ఘటనపై విచారణ సమయంలో సుప్రీంకోర్టు
* పిటిషనర్ తీరుపై అసహనం
* పిల్ ఉపసంహరణ
ఆకేరు న్యూస్, డెస్క్ : పహల్గామ్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సమయంలో ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరిగింది. పిటిషనర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్ దాఖలు చేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. దేశంపై బాధ్యత లేదా అని పిటిషనర్ ను ప్రశ్నించింది. బలగాల మనో స్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని అసహనం వ్యక్తం చేసింది. ప్రతీ పౌరుడు చేతులు కలపాల్సిన సమయం ఇది అని పేర్కొంది. సాయుధ బలగాలను నిరాశ పరిచేలా ఏ పిటిషన్ నూ వేయవద్దని సూచించింది. ఈ పిటిషన్ ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు (SUPREME COURT) ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీం అభిప్రాయాలతో ఏకీభవించిన పిటిషనర్ పిల్ ను ఉపంసహరించుకున్నారు.
……………………………………….