* పదో తరగతిలో స్కూల్ టాపర్
* సిరిసిల్ల జిల్లాలో ఘటన
ఆకేరున్యూస్: కష్టపడి చదివింది. పది ఫలితాల్లో స్కూల్ ఫస్ట్ వచ్చింది. అయితే ఆమెను విధి వెక్కిరించడంతో పది రోజుల క్రితమే అనంతలోకాలకు వెళ్లింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన ఆకుల నాగచైతన్య అదే గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలను ఉత్సాహంగా రాసింది. అయితే అంతలోనే ఏమైందో ఏమో అనారోగ్యానికి గురై పరిస్థితి విషమించడంతో ఏప్రిల్ 17న మరణించింది. అయితే బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
