ఆకేరు న్యూస్, వరంగల్ : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా డాక్టర్ రమేష్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన అవకతవకల వల్ల
అప్పటి వీసీ డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో గతంలో
మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ రమేష్ రెడ్డిని ప్రభుత్వం
వైస్ చాన్స్ లర్ గా నియమించింది. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు..
……………………………………………

