
* అక్రమంగా విదేశాలకు డబ్బులు బదిలీ
* నైజీరియా ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విదేశాలకు అక్రమంగా డబ్బులు బదిలీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును అక్రమంగా విదేశాలకు ఈ ముఠా తరలిస్తోంది. ఈ ముఠాకు చెందిన ముగ్గురు నైజీరియన్ల(nigerians)ను యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. డార్క్ వెబ్, ఫారెక్స్ మనీ ఏజెంట్ల ద్వారా నిందితులు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి 12.5లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. భారత్(India)తో పాటు అమెరికా(America)లోనూ నిందితులు డ్రగ్స్ విక్రయించారు. అమెరికాలో యువతులను ట్రాప్ చేసి నిందితులు డబ్బును భారత్ కు పంపిస్తున్నారు. అమెరికా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నగదు భారత్‌కు బదిలీ చేసేవారు. అనంతరం భారత్ నుంచి అక్రమ మార్గంలో సొంత దేశం నైజీరియాకు పంపేవారు. వీరిపై హైదరాబాద్‌లోనూ కేసులు నమోదుకావడంతో విశ్వసనీయ సమాచారం పోలీసులు వారి ఆటకట్టించారు.
……………………………………