* 3 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఆకేరు న్యూస్ . హైదరాబాద్ : ప్రాణాలు నిలిపే వృత్తిలో ఉన్న ఓ యువ డాక్టర్ ప్రాణాంతకమైన డ్రగ్స్ కు బానిసకావడమే కాకుండా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. గాంధీ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్న జాన్ పాల్ అనే యువ డాక్టర్ ముషిరాబాద్లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. డ్రగ్స్ కు అలవాటు పడిన జాన్ పాల్ ,క్రమంగా డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టాడు. డిల్లీ, గోవా, బెంగళూరులనుంచి డ్రగ్స్ ను విక్రయించి సిటీలో అమ్ముతున్నారు. ఈ దందాలో డాక్టర్ కు తోడుగా మరో ముగ్గురు యువకులు సందీప్,ప్రమోద్, శరత్ లు ఉన్నారు. డాక్టర్ డ్రగ్స్ దందా చేస్తున్నాడని పక్కా సమాచారం అందుకున్న స్పెషల్ టాస్క్ పోలీసులు డాక్టర్ ఇల్లును సోదాచేసి 3 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ను అదుపులోకి తీసుకోగా మిగతా ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారు. డాక్టర్ ఇంట్లో 26.95 గ్రాముల ఓజీ, 6.21 గ్రాముల ఎండిఎంఎ,15 ఎల్ ఎస్ డీ డాస్ట్స్ 1.32 గ్రాముల కొకైన్,5.80 గ్రాముల గుమ్మస్,0.008 గ్రాముల హశిష్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
……………………………………………..
