* మాజీ మంత్రి హరీశ్‌రావు అభ్యంతరకర వ్యాఖ్యలు
* భగ్గుమన్న అధికార పక్షం
* అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ(TELANGANA ASSEMBLY)లో ఈరోజు ఉదయం తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. అధికార, విపక్షాల సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రోడ్ల నిర్మాణంపై ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకుంది. మామ చాటుగా అల్లుడు హరీశ్‌రావు రాష్ట్రాన్ని హరీశ్‌రావు దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(KOMATIREDDY VENKATAREDDY) ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కమీషన్లు పొందారని తెలిపారు. హరీశ్‌రావు(HARISRAO)పై ఆరోపణలను తాను నిరూపిస్తానని చెప్పారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు కొందరు పొద్దునే తాగి వస్తున్నట్టు ఉన్నారని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు(DRUNKEN DRIVE TESTS) చేయాలని అన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు భగ్గుమన్నారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వారు చేసే పనులను అందరిపైనా వేస్తున్నారని బదులిచ్చారు. ఈ అంశంపై కాసేపు అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
……………………………………