* చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల అభియోగాల కేసులో మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్(DTC Kishan Naik)కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను అధికారులు బుధవారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిన్న ఏసీబీ అధికారులు హైదరాబాద్ (Hyderabad)లోని కిషన్ నాయక్ నివాసంతోపాటు నిజామాబాద్, నారాయణఖేడ్లలోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, మహబూబ్‌నగర్‌లోని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం డీటీసీ కిషన్ నాయక్‌ను అధికారులు ఏసీబీ (Acb) న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పోలీసుల నివేదికను పరిశీలించి న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో ఆయనను ఈరోజు ఉదయం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆయనను కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఏసీబీ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
…………………………………………………….

