Due Date Movie
Due Date | ఆకేరు న్యూస్, హైదరాబాద్: లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డ్యూ డేట్’ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలోకి వెళ్లింది.
వరిష్ స్టూడియోస్ బ్యానర్‌పై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. ప్రణీత పట్నాయక్, విజ్ఞాని, కృష్ణ భగవాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హీరో, హీరోయిన్‌తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
కోర్ట్‌రూమ్ డ్రామా
ప్రస్తుత సమాజంలో చర్చనీయాంశంగా ఉన్న ఓ అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను కమర్షియల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రతి నెలా ప్రతి వ్యక్తి గుర్తు పెట్టుకునే ‘డ్యూ డేట్’ చుట్టూ కథ నడుస్తుందని పేర్కొంది.
కథ, కథనంతో పాటు టైటిల్ కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఆసక్తికరమైన మలుపులు, వాణిజ్య అంశాలతో సినిమా రూపొందుతోందని చెప్పారు.
15 రోజుల షెడ్యూల్
హైదరాబాద్‌లో ప్రారంభమైన తొలి షెడ్యూల్ 15 రోజుల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేయడంతో పాటు భావోద్వేగంగా ఆకట్టుకునేలా ఉంటుందని నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రానికి ఆర్ట్: జవ్వాడి నాయుడు, మాటలు: హరీష్ మీనన్, ఎడిటింగ్: సత్య గిడుతూరి, డీఓపీ: చెంచు జింక. నిర్మాతలు పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను కాగా, దర్శకత్వ బాధ్యతలను ఆనంద్.కె. నిర్వహిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
