* మీకు తెలుసా..?
* 1952, 1957 ఎన్నికల్లో అమలైన విదానం
ఆకేరు న్యూస్ , హైదరాబాద్: భారత పార్లమెంట్ ఎన్నికల విధానంలో క్రమంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇపుడున్నట్టు గతంలో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు లేవు. ఎస్టీ, ఎస్సీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసేవారు. ఆ నియోజకవర్గాల్లో జనరల్ కేటగిరికి చెందిన అభ్యర్థి ఒకరు , రిజర్వుడు కేటగిరికి చెందిన మరో అభ్యర్థి ఒకే నియోజకవర్గాల్లో పోటీ చేసేవారు. భారత దేశంలో జరిగిన మొదటి , రెండవ ఎన్నికలు ఇదే విదంగా జరిగాయి. ఇలా ఒకే లోక్సభ నియోజకవర్గంలో ఇద్దరు ఎంపీలు ఉండేవారు. వీటిని ద్విసభ్య నియోజకవర్గాలు ( Two member constituencies ) అనేవారు. ఇవి తెలంగాణలో 3 నియోజకవర్గాలు , ఆంధ్రప్రదేశ్లో 8 నియోజకవర్గాలు ఉండేవి. ఈ విదానాన్ని ద్వి సభ్య నియోజకవర్గాల అబాలిషన్ యాక్ట్ -1961 ( The two member consituencies ( abolistion act ) ద్వారా రద్దు చేశారు.
ద్విసభ్య నియోజకవర్గాలు ఇవే:
తెలంగాణ
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం
1952 – బద్దం ఎల్లారెడ్డి – పీడీఎఫ్
ఎం ఆర్ కృష్ణ – ఎసీసీఎఫ్
1957 – ఎం . శ్రీరంగారావు- కాంగ్రెస్ పార్టీ
ఎంఆర్ కృష్ణ – కాంగ్రెస్
మహబూబ్నగర్ :
1952 – పీ రామస్వామి – కాంగ్రెస్ పార్టీ
కే జనార్ధన్ రెడ్డి – కాంగ్రెస్ పార్టీ
1957- జే రామేశ్వర్ రావు- కాంగ్రెస్,
పీ రామస్వామి- కాంగ్రెస్ పార్టీ
నల్గొండ :
1952- ఆర్ నారాయణ రెడ్డి-
పీడీఎఫ్, ఎస్ . అచ్చాలు- పీడీఎఫ్
1957 – డీ వెంకటేశ్వర్ రావు-
పీడీఎఫ్ – డీ .రాజయ్య – కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
పార్వతీ పురం :
1957 – బీ సత్యనారాయణ – కాంగ్రెస్,
డీ సూరి దొర – ఇండిపెండెంట్
విశాఖ పట్నం
1952 – లంక సుందరం – ఇండిపెండెంట్
జీ మల్లు దొర – ఇండిపెండెంట్
కాకినాడ :
1957: బీఎస్ మూర్తి కాంగ్రెస్ , మొసలికంటి తిరుమల రావు , కాంగ్రెస్
రాజమండ్రి :
1952 – కావేటి మోహన్ రావు, సీపీఐ
ఎన్ రెడ్డి నాయుడు సోషలిస్ట్
ఏలూరు :
1952 – కొండ్రు సుబ్బారావు – సీపీఐ ,
బీఎస్ మూర్తి , కేఎంపీపీ
ఒంగోలు :
1952 ఎమ్ నానాదాస్ – ఇండిపెండెంట్
పీ వెంకట రాఘవయ్య – ఇండిపెండెంట్
నెల్లూరు :
1957 – బీ అంజనప్ప , కాంగ్రెస్
ఆర్ ఎల్ ఎన్ రెడ్డి , కాంగ్రెస్
చిత్తూరు :
1952 టీఎన్వీ రెడ్డి , కాంగ్రెస్
ఎమ్ వి జీ శివ – కాంగ్రెస్
——————–