
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలుగు సంవత్సరం ప్రకారం ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీన రానుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అక్టోబర్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని ఉత్తర్వులు జారీ చేశారు.