
* ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలి
* ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలి
* అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
* సీపీఎం ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ
ఆకేరున్యూస్, హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం వెంటనే భూటకపు ఎన్ కౌంటర్లను ఆపాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం హన్మకొండ సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులపై కాల్పుల విరమణ పాటించిన ప్రధాని కగార్ ఆపరేషన్ ను నిలిపి వేయడం ఓ లెక్కకాదన్నారు. రాష్ట్రంలో తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆకలి సూచికలో భారత దేశం నూట పదకొండవ స్థానంలో ఉందన్నారు. దేశంలో పేదరికం తాండవం చేస్తుంటే ప్రపంచంలో అభివృద్ధి జూచికలో నాలుగో స్థానంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నామని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో అసమానతలు రోజురోజుకీ పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ భద్రతలో వైఫల్యం..
కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం వల్లే పహల్గాం దాడి జరిగిందని జాన్ వెస్లీ విమర్శించారు. దేశ విదేశాల్లో గొప్పలు చెప్పుకుంటున్న బిజేపీ సర్కార్ దాడి జరిగి ఇన్ని రోజులు కావస్తున్నా దాడికి కారకులైన నలుగురు తీవ్రవాదులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇది కేంద్రప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు పహల్గాం ఘఠనను ఖండిరచి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయని గుర్తు చేశారుజ పహల్గాం దోషులను ఎప్పడు పట్టుకుంటారని దేశ ప్రజలు ఎదురుచూస్తుంటే దేశ ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో కేంద్రం ఉందని విమర్శించారు. ఇంతవరకు ఒక్క ఉగ్రవాదనిని పట్టుకోలేక పోయారని విమర్శించారు. దాడి జరుగకముందే భద్రతా కల్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలమయిందన్నారు. భారత పాకిస్తాన్‌లు కాల్పులు విరమించడానికి తానే కారణం అని ఓవై అమెరికా అధ్యక్షుడు వివిధ అంతర్జాతీయ వేదికల మీద బహిరంగగంగా చెప్పుకుంటుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మోదీ ఉన్నారని జాన్ వెస్లీ ధ్వజమెత్తారు. ఇది భితరదేశ సార్వభౌమాధికారానికి ,ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మోదీ వ్యవహరించడం శోచనీయమన్నారు. దీన్ని ప్రతిఒక్కరూ ఖండిరచాలన్నారు.దీనిపై ప్రజలకు వివరించాల్సిని బాధ్యత ప్రధాని మోదీ పై ఉందన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి దేశ ప్రజలకు తెలియజేసే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఇంత సున్నితమైన దేశ భధ్రతకు సంబందించిన విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని.. అప్పుడే ప్రజాస్వామ్య విలువలకు బలం చేకూరుతుందని జాన్ వెస్లీ హితవు పలికారు.
………………………