
* వరుస భూకంపాలతో వణికిన ఆగ్నేసియా దేశాలు
* మయన్మార్‌లో ఇప్పటి వరకు 25 మృతదేహాలు వెలికితీత
* భారీగా పెరగనున్న ప్రాణ, ఆస్తి నష్టం
* భారత్‌లోనూ భూకంప ప్రభావం
ఆకేరు న్యూస్, డెస్క్ : మయన్మార్, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లో తీవ్ర భూకంపాలు (Earth Quakes) సంభవించాయి. మయన్మార్ (myanmar)ను వరుసగా మూడు భూకంపాలు వణికించాయి. మయన్మార్‌లో 7.7, 6.7, 4.9 తీవ్రతతో వరుస భూ ప్రకంపనలు కలిగాయి. బ్యాంకాక్ లో 7.3, బంగ్లాదేశ్‌లో 7.3 తీవ్రత నమోదైంది. భూకంపం దాటికి మయన్మార్, బ్యాంకాక్(bangkok)లో భారీ భవనాలు కుప్పకూలాయి. పలు ప్రాంతాల్లో భారీ భవంతులు పేక మేడల్లా కుప్పకూలాయి. పరిసర ప్రాంతాల్లో దుమ్ము, ధూళి భారీగా వ్యాపించాయి. మయన్మార్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మనీ సంస్థ గుర్తించింది. జనం భయాందోళనతో పరుగులు తీశారు. బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో 43 మంది కార్మికులు చిక్కుకున్నారు. బ్యాంకాక్ లో భూకంపం దాటికి ఇద్దరు మృతి చెందారు. థాయ్‌లాండ్‌లో ప్రధాని షినవ్రత అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భారత్‌లోని పలు ప్రాంతాల్లో కూడా మయన్మార్ భూకంప ప్రభావం కనిపించింది. కోల్‌కతా, ఇంఫాల్, మేఘాలయాలోనూ భూకంపాలు సంభవించాయి. కాగా, మయన్మార్‌లో ఇప్పటి వరకు 25 మృతదేహాలు వెలికితీశారు. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
…………………………………