* కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పదిహేను నెలల కాంగ్రెస్ పాలనపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తనదైన శైలిలో విమర్శలు సంధించారు. బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో సౌభాగ్యనంగరంగా ఉన్న హైదరాబాద్, అసమర్థ కాంగ్రెస్ ఏలుబడిలో అభాగ్యనగరంగా మారిందని విమర్శించారు. హైడ్రా(HYDRA), మూసీ (MUSI) ప్రక్షాళన పేరుతో నగరంలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని విమర్శించారు. అమ్మకాలు జరగకపోవడంతో రియల్టర్లు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అన్నదాతలే కాదు అమాయక రియల్ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కూల్చడం కాదు కట్టడం నేర్చుకోవాలని, అబద్ధాలు చెప్పడం కాదు అభివృద్ధి చేయడం నేర్చుకోవాలని కాంగ్రెస్ పాలకులకు చురకలంటించారు. ‘పదేళ్ల కేసీఆర్(kCR) పాలనలో సౌ‘భాగ్యనగరం’.. 15 నెలల అసమర్థ కాంగ్రెస్ పాలనలో అ‘భాగ్యనగరం’. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్లో తగ్గిన ఇండ్ల కొనుగోళ్లు. పేదల ఇండ్ల పైకి బుల్డోజర్లు, పెద్దల ఆస్తులతో సెటిల్మెంట్లు. రియల్ ఢమాల్.. ఇన్ఫ్రా సజీవ సమాధి. మూసీ, హైడ్రా పేరుతో మూటలు కడుతున్న కాంగ్రెస్ గద్దలు. అమ్మకాలు జరగక ఆందోళనలో రియల్టర్లు. అన్నదాతలే కాదు అమాయక రియల్ వ్యాపారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. హైదరాబాద్(HYDERABAD)లో గత త్రైమాసికంలో 49 శాతం తగ్గిన ఇళ్ల విక్రయాలు. ఆఫీస్ లీజింగ్ కూడా అధఃపాతాళానికి. 2025 జనవరి-మార్చి మధ్య 41 శాతం తగ్గుదల. కాంగ్రెస్ సర్కార్ దూరదృష్టి లేని, అసమర్థ విధానాలే ఈ పతనానికి కారణం. కూల్చడం కాదు కట్టడం నేర్చుకోండి. అబద్ధాలు చెప్పడం కాదు.. అభివృద్ధి చేయడం నేర్చుకోండి.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
