* 48 గంటల పాటు ప్రచారం నిలిపివేత
* కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్: కేసీఆర్ ప్రచారంపై ఎన్నికలపై ఎన్నికల కమిషన్ ( Election Commission Of India ) నిషేధం విదించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు నిషేధం విదించింది. ఎప్రిల్ 5న సిరిసిల్ల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ కేసీఆర్ వివరణ కోరింది. తెలంగాణ మాండలికంలోని పదాల అర్థాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కేసీఆర్ ఈ సీకి వివరణ ఇచ్చారు. కేసీఆర్ వివరణతో సంతృప్తి చెందలేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ భావించింది. 48 గంటలపాటు ప్రచారం నిలిపి వేయాలని కేసీఆర్ను ఆదేశించింది.
——————————-