Neethu Bai ED Raids Hyderabad
* ఫ్యామిలీ మొత్తం అదే పని
* వారే వీరి కస్టమర్లు
* గంజాయి డాన్‌పై ఈడీ రైడ్
* నీతూబాయి ఇంట్లో సోదాలు
* హవాలాతోనూ అక్రమార్జన
* తెలంగాణ వ్యాప్తంగా 8 చోట్ల తనిఖీలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గంజాయి డాన్ నీతూబాయి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 చోట్ల ఒకేసారి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఎక్సైజ్ శాఖతో పాటు యాంటీ నార్కోటిక్స్ డ్రగ్ నిరోధక విభాగాలు నమోదు చేసిన పలు కేసుల ఆధారంగా, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ రంగంలోకి దిగింది. గంజాయి అమ్మకాలతో నీతూబాయి రూ. కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హవాలా రూపంలోనూ డబ్బులు సంపాదించినట్లు ఈడీి ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. నీతూ బాయికి సంబంధించిన ఆర్థిక లావాదేలు, ఆస్తులు పై కూడా ఈడీ దృష్టి సారించింది.
* ఎవరీ నీతూబాయి?
నీతూబాయి తన కుటుంబ సభ్యులతో కలిసి నానక్‌రామ్‌గూడలోని లోధా బస్తీని కేంద్రంగా చేసుకుని ఏళ్లకు ఏళ్లుగా ఈ అక్రమ గంజాయి వ్యాపారాన్ని సాగిస్తోంది. స్థానికంగా ఆమెను ‘గంజాయి డాన’ లేదా ‘గంజాయి క్వీన’ అని పిలుస్తుంటారు. ఈ అక్రమ వ్యాపారంలో ఆమె భర్త మున్నాసింగ్, కొడుకులు గౌతమ్, గోవింద్, కుమార్తెతో పాటు ఇతర కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విశాఖపట్నం, ఏజెన్సీ ప్రాంతాల నుంచి రూ. 8,000లకు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి, చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి రూ. 50,000 వరకు విక్రయిస్తూ దాదాపు రూ. కోట్లు ఆర్జించినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.
* ఐటీ ఉద్యోగులే కస్టమర్లు
నగరంలోని ఐటీ ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు, డెలివరీ బాయ్స్ వీరి ప్రధాన కస్టమర్లుగా ఉన్నారని తెలుస్తోంది. ఎక్సైజ్ పోలీసులు గతంలో ఈమెపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినప్పటికీ, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ దందాను కొనసాగించడం సంచలనంగా మారింది. ఈ అక్రమ వ్యాపారం ద్వారా వచ్చిన కోట్ల రూపాయల సొమ్మును హవాలా మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గంజాయి విక్రయాల ద్వారా పొందిన అక్రమ సంపాదనను స్థిరాస్తుల్లోకి మార్చిన ఆధారాలు గుర్తించారు. దీంతో ఈడీ ఆమె ఆర్థిక లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతోంది.
* పరారీలో నీతూబాయి
నీతూబాయి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలు, స్థిర-చరాస్తుల పత్రాలు, డిజిటల్ డివైజ్‌లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.ప్రస్తుతం నీతూబాయి పరారీలో ఉండగా, ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం అయ్యాయి. నేటి సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లు, నగదు, బంగారంతో పాటు హవాలా నెట్‌వర్క్‌కు సంబంధించిన సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
