
ఆకేరున్యూస్,హైదరాబాద్ : సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాశారు.మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఆమె కోట్లు సంపాదించినట్లు సమాచారం. ఈ కేసులో 30 మంది అరెస్ట్ అయి విచారణ తరువాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ పట్టణంలో పిల్లల విక్రయాల్లో దళారులుగా వ్యవహరించిన ముగ్గురు దళారులతో డాక్టర్ నమ్రతకు సంబందాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు.వీరి ద్వారా డాక్టర్ నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
…………………………………