
* త్వరలో అక్రిడేషన్ కార్డులు
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్ ఖమ్మం : త్వరలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కనిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు, గురువారం ఆయన ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన టీయూడబ్ల్యూజే ( ఐజేయూ) జిల్లా మహాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. జర్నలిస్టల ఇళ్ల స్థలాల విషయం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్నందున ఈ విషయంపై న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఇళ్ల స్థలాల కేటాయింపులో ఎలాంటి ఆటంకం ఏర్పడకూడదనే ఆచితూచి వ్యవహరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు.
…………………………………………