*ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు:గోదావరి ప్రభావం పెరిగింది ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు.గురువారం ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల, కొండాయి బ్రిడ్జి గోదావరి వరద ఉధృతి ని జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజులు కురుస్తున్న వర్షానికి గోదావరి ( GODAVARI RIVER ) వరద ఉదృత పొంగిందనీ, తాత్కాలిక రోడ్డు కొట్టుకొని పోయిందని, కొండాయి గ్రామ ప్రజలకు నిత్యవసర సరుకులు, వైద్యాధికారులను అందుబాటులో ఉంచామని ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టామని అత్యవసర పనుల కోసం ఒక బోటును అందుబాటులో ఉంచామని, అదనంగా రెండు బోర్డులు ఈ రోజు తెప్పించడం జరుగుతుందని, గ్రామ ప్రజలకు సంబంధిత అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు.
బోట్లు సిద్ధంగా ఉన్నాయి ( BOATS )
దీనితోపాటు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో రెండు బోట్లను సమకూర్చుకున్నామని అదేవిధంగా ఎన్డీ ఆర్ఎఫ్ టీం తో పాటు నాలుగు బోట్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.ప్రస్తుత సమయంలో జిల్లా లో, ఎగువేల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరిగిన దృష్ట్యా ముంపు గ్రామాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా వారికి నెలకు సరిపడే నిత్యవసర వస్తువులను సిద్ధం చేశామని, అత్యవసర సమయాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బోట్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను నియమించామని ఆయన తెలిపారు. వీటితోపాటు అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వివరించారు. జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అధికారులు సిద్ధంగా ఉండాలి
వర్షాకాలంలో ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తంగా ఉండాలన్నారు.వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. అత్యవసర సేవలకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనలు మేరకు రానున్న మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ సమయంలో వర్షం వస్తుందో తెలీదు కాబట్టి ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగి పొర్లే నది నాలాలు దాటకుండా గ్రామాలలో టాం టాం ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పొంగిపొర్లే వాగులు, రహదారుల్లో ప్రజలు రవాణా చేయకుండా భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని సూచిక బోర్డ్లు ఎర్పాటు చేయాలని ఆయన తెలిపారు.
టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 ( TOLL FREE NUMBER )
ప్రజలు అత్యవసర సేవలకు తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.వర్షాకాలం దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కంట్రోల్ రూమ్లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.వరద ఉధృతి ఎక్కువ ఐతే వెంటనే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ప్రజలు సహకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నాగరాజు, తహసిల్దార్ జగదీష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
