* ఏపీ వ్యాపారులకు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ విన్నపం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని మద్యం షాపులు తెలంగాణవారికే కేటాయించాలని టీజీ బార్ అండ్ రెస్టారెంట్ (TG BAR AND RESTAURANT ASSOCIATION) డిమాండ్ చేస్తోంది. తమ విజ్ఞప్తిని టీజీ ఎక్సైజ్ శాఖ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ టెండర్లు వేస్తున్నారనిక పేర్కొంది. ఏపీ రాజకీయ నేతల బినామీలు ఇక్కడ టెండర్లు వేస్తున్నారని తెలిపింది. ఏపీ వ్యాపారులు ఏపీలోనే వ్యాపారం చేసుకోవాలని, గతంలో మమ్మల్ని ఏపీ(AP)లో భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపించింది. దయచేసి తమ పొట్ట కొట్టొద్దని టీజీ బార్ అండ్ రెస్టారెంట్ అధ్యక్షుడు దామోదర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
