నేడే ఎన్నికల షెడ్యూల్ విడుదల
*లోక్ సభ సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు
* మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల కమిషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నేడు ఎన్నికల షెడ్యూల్ ( Election Schedule ) వెలువడనుంది. మద్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు విలేకరుల సమావేశంలో ప్రకటించనున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్,ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు సైతం ఎన్నికల తేదీలను వెలువరిస్తారు. దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ ( Election Code) అమల్లోకి వస్తుంది. నగదు బదిలీ, రవాణాపై పూర్తి స్థాయి నియంత్రణ, నిఘా కొనసాగుతుంది. గత ఎన్నికల కంటే ఆరు రోజులు ఆలస్యంగా షెడ్యూల్ విడుదలవుతోంది. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయడంతో పాటు గతంలో ఉన్న సభ్యుడి ఖాళీని భర్తీ చేయడం వల్ల ఆలస్యమయినట్లుగా తెలుస్తోంది. కొత్త కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్,సుఖ్భీర్ సంధూల నియామకం జరిగింది. దేశవ్యాప్తంగా గత ఎన్నికలు 7 దశల్లో జరిగాయి . ఇపుడు దశల్లో జరగనున్నాయో మద్యాహ్నం తేలనుంది. అదే విదంగా దేశవ్యాప్తంగా ఖాళీఅయిన అసెంబ్లీ స్థానాలకు సైతం ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణలో ఇటీవల కంటోన్మంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ స్థానానికి కూడా ఎన్నిక ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
———–
Related Stories
December 4, 2024
December 4, 2024
December 3, 2024