* పెద్దపల్లి జిల్లాలో విషాదం
ఆకేరున్యూస్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్((Electrical short circuit)తో తల్లీకూతుళ్లు మృతి చెందారు. రామగిరి మండలం రాంనగర్‌కు చెందిన పోషమ్మ (65), గడ్డం కొమురమ్మ (45) తల్లీకూతుళ్లు. నిన్న అర్ధరాత్రి విద్యుత్ షాక్ కు గురై సజీవ దహనమయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తల్లీకూతుళ్ల మృతితో గ్రామంలో విషాదచాయలు చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
