
* హైదరాబాద్ లో సింగరేణి పెవిలియన్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రఖ్యాత బి.ఎం.బిర్లా విజ్ఞాన కేంద్రంలో సింగరేణి పెవిలియన్ ప్రారంభమైంది. ఈ పెవిలియన్ ను సింగరేణి సీఎండీ శ్రీ ఎన్.బలరామ్, జి.పి. బిర్లా పురావస్తు, ఖగోళ మరియు వైజ్ఞానిక సంస్థ ఛైర్పర్సన్ శ్రీమతి నిర్మల బిర్లా లు ప్రారంభించారు.ఈ పెవిలియన్ లో సింగరేణి ప్రాంతంలోని రామగుండం-1 ఏరియా మేడిపల్లి ఉపరితల గని వద్ద నాలుగేళ్ల క్రితం జరిపిన తవ్వకాలలో బయటపడిన 110 లక్షల సంవత్సరాల నాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాలు, అతి పురాతన కాలానికి చెందిన శిలాజ కలపను ఈ పెవిలియన్ లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఏనుగులు 110 లక్షల ఏళ్ల క్రితం నుంచి 6 వేల ఏళ్ల క్రితం వరకు జీవించినట్లు పరిశోధనల్లో తేలింది. ఇలాంటి ఏనుగు దంతాలతో కూడిన అవశేషాలు గతంలో నర్మదా నది తీరంలో లభించగా.. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతమైన మేడిపల్లి వద్ద దొరకడం విశేషం.
………………………………….