సరిహద్దుల్లో కలకలం ..
————————–
* వెంకటాపూర్ మండలంలో ముగ్గురు మావోయిస్ట్‌ల మృతి
* మృతుల్లో సెంట్రల్ రీజనల్ కంపెనీ కమాండర్ సాగర్
* సాగర్ భూపాల్ పల్లి జిల్లా కాటారం మండలానికి చెందినవాడు
ఆకేరు న్యూస్ , ములుగు : రాష్ట్ర సరిహద్దుల్లో మరో సారి కలకలం రేగింది. తెలంగాణ – చత్తీష్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ ( Encounter ) జరిగింది. చత్తీష్ గఢ్ బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్- తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా సరిహద్దు కర్రి గుట్టల వద్ద ఎన్ కౌంటర్ జరిగింది. ప్రత్యేక పోలీసుల బలగాల కూంబింగ్‌లో భాగంగా మావోయిస్ట్‌లు ( Maoists ) తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మద్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్ట్‌లు మృతి చెందారని పోలీస్ అధికారులు తెలిపారు. మృతుల్లో మావోయిస్ట్ పార్టీ కీలక నేత అన్నె సంతోష్ అలియాస్ సాగర్ ఉన్నట్టు సమాచారం. సాగర్ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్రీజినల్ కంపెనీ -02 కమాండర్‌గా పని చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన ఇద్దరు మావోయిస్ట్‌లను గుర్తించాల్సి ఉంది. మృతుల వద్ద ఏకే – 47 తుపాకీతో పాటు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
===================