ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆకేరు న్యూస్ డెస్క్, హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు మావోయిస్టులకు తీవ్రగాయాలయ్యాయి. నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులకు (Maoists) మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్(CHATHISGHAD)లోని నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీప్రాంతం(FOREST AREA)లో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడిన నక్సల్స్.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఆ ప్రాంతంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతులను గుర్తించాల్సి ఉన్నదని వెల్లడించారు.
——————————————