ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎన్నికల వేళ నేతల విన్యాసాలు వింత వింతగా ఉంటాయి.. రోడ్డుపై ఏ వ్యాపారం కన్నించినా అందులో పరకాయ ప్రవేశం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టు కోవడానికి వినూత్నంగా ప్రచారాలు చేస్తున్నారు. సెలూన్లు, లాండ్రీ షాపులు, పాన్ షాపులు, బడ్డీ కొట్టు, చాయ్ హోటళ్లు , ఇడ్లీ సెంటర్లు,కూరగాయల దుకాణాలు, మటన్ షాపులు , అరటి పళ్లు బండ్లు.. ఇలా ఏది కన్పిస్తే చాలు అక్కడికి పోయి ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓ సెలూన్ షాపులోకి పోయి యజమాని వద్దను నుండి కత్తెర తువ్వెన తీసుకొని ఓ కస్టమర్ కు కటింగ్ చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా సెలూన్ షాపులోకి పోయి కస్టమర్ కు కటింగ్ చేయడం చూశాం. తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావు చాయ్ వాలా అవతారం ఎత్తారు. జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎర్రబెల్లి జూబ్లీహిల్స్ లోని ఓ చాయ్ దుకాణంలో ప్రవేశించి తానే స్వయంగా చాయ్ ని చేసి అక్కడికి వచ్చిన కస్టమర్లకు పంపిణీ చేశారు. కారు గుర్తుకే ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
……………………………………………………
