
* సబ్ కమిటీ నివేదిక ఆధారంగానే రైతు భరోసా
* రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, కమలాపూర్: కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో ధాన్యం పండిరదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (PONNAM PRABAKER) అన్నారు. సోమవారం సాయంత్రం కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రసంగించారు. వ్యవసాయ కమిటీ చైర్మన్గా నియామకమైన తవుటం రaాన్సీ రాణి, వైస్ చైర్మన్గా దేశిని ఐలయ్య ఏర్పడిన కమలాపూర్ నూతన పాలక వర్గం మండల రైతులకు మార్కెట్ పరంగా ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా రైతులు పండిరచిన సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తుండటంతో గతంలో రాజకీయాలు మాట్లాడిన విపక్షాలు నేడు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణలో నీటి సదుపాయాలు లేనట్టుగా చెప్పినప్పటికీ, కాలేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు లేకున్నా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటితోనే పెద్ద ఎత్తున పంటలు పండాయని అన్నారు.
కొండలు ,గుట్టలు ,ఫ్లాట్ లకు కాకుండా నిజమైన రైతులకు రైతు భరోసా ఇవ్వాలని సబ్ కమిటీ వేసి, నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనేక కార్యక్రమాలు చేపట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ అందిస్తున్నామని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. రైతులకు ఎక్కడ కరెంట్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, తవుటం రవీందర్, బాలసాని రమేష్, అశోక్ రెడ్డి, వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………….