* మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
* 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తున్నామని, సన్నాలకు,దొడ్డు వడ్లకు వేరు వేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, ఆహారం, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్‌లో 60 లక్షల 39 వేల ఎకరాల్లో సాగు జరగడం వల్ల 146 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నట్లు అంచనా వేస్తున్నామని 91 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అంచనా వేసిందని, మొట్టమొదటి సారిగా 40 లక్షలమెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు గోడౌన్లను ఏర్పాటు చేయనున్నట్టు, డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదని సరిహద్దు రాష్ట్రలనుండి వచ్చే ధాన్యంపై గట్టి నిఘా ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆశించిన మేరకు సన్నాల దిగుబడి వస్తుందని మంత్రి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఖరీఫ్ నుండి సన్నాలకు 500 బోనస్ఇవానున్నామని, ఈ నిర్ణయం విప్లవాత్మకమైనదని సరిహద్దు రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, ధాన్యం కొనుగోలులో అధికారులదే కీలక పాత్ర అని, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. రైతులు సున్నిత మనస్కులు, వారి మనస్తత్వన్నీ బట్టి నడుచు కోవాలని, ఖరీఫ్‌లో సేకరించిన సన్నాలతో జనవరి నుండి చౌక ధరల దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ మూడు కోట్ల మంది లబ్ధిదారులకు గాను మనిషి ఒక్కింటికి 6 కిలోల సన్న బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంగాల ద్వారా 4,496, ఐ.కే.పి కేంద్రాల ద్వారా 2102,ఇతరుల ద్వారా 541 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సోమవారం ఉదయం మఱ్ఱి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 2024/25 ఖరీఫ్ పంట కొనుగోలుపై రాష్ట్రంలోనీ జాయింట్ కలెక్టర్ లు, జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా స్థాయి పౌర సరఫరాల శాఖ మేనేజర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.యస్.చవాన్, జాయింట్ సెక్రటరీ ప్రియాంకా ఆల, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ యం.డి.లక్ష్మి, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సొమ్ముతో అప్పు చేసి కొనుగోలు చేస్తున్న ధాన్యం అంశంలో అవకతవకలకు తావునియ్యద్దని మంత్రి అధికారులకు సూచించారు. అక్టోబరు మొదటి వారంలో మొదలయ్యే ధాన్యం కొనుగోళ్లు జనవరి మాసాంతానికి కొన సాగుతాయన్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మొదటివారంలో నల్లగొండ, మెదక్, రెండవ వారంలో నిజామాబాద్,కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,నారాయణపేటలని ఆయన వివరించారు. అదే విధంగా మూడవ వారంలో కరీంనగర్, జగిత్యాల,వరంగల్ జనగామ,సూర్యాపేట, మేడ్చల్ లు ఉంటాయన్నారు. నాల్గవవారంలో మంచిర్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి ,హన్మకొండ లు ఉండగా నవంబర్ మొదటి వారంలో నిర్మల్ ,సిద్దిపేట, రంగారెడ్డి,రెండో వారంలో కొనరం భీం ఆసీఫాబాద్,భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల,వనపర్తిలు ఉన్నాయన్నారు. మూడోవారంలో భూపాలపల్లి, ములుగు, ఖమ్మంలు నాలుగో వారంలో మహబూబాబాద్,వికారాబాద్, ఆదిలాబాద్ వుంటాయని మంత్రి తెలిపారు.
……………………………..