* సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
* సూసైడ్ నోట్ లభ్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కన్నడ సీరియల్ నటి శోభిత(ACTOR SHOBITHA) ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ కీలకంగా మారింది. నిన్న రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్ మెంట్ ఫ్లాట్‌లో శోభిత ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాదిన్నర క్రితమే సాఫ్టవేర్ ఇంజనీర్ సుధీర్ ను ఆమె వివాహం చేసుకున్నారు. మ్యాట్రిమోనీ డాట్ కామ్ ద్వారా సుధీర్ రెడ్డితో శోభితకు పరిచయం ఏర్పడింది. వివాహం తర్వాత శోభిత సీరియల్స్, సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే భార్యాభర్తలిద్దరు గోవా(GOA)కి వెకేషన్‌కి వెళ్లి వచ్చారు. తాజాగా అమె ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్.. చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్.. అని రాసి ఉన్న సూసైడ్ నోట్(SUICIDE NOTE)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా , ఇతర కారణాలు ఉన్నాయి అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమె మృతిపై ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు. శోభిత కుటుంబసభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
……………………………………….