
* పోలీసులకు బాధితుల ఫిర్యాదు
ఆకేరున్యూస్, వరంగల్ :గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గుండా ప్రకాశ్ రావు ను హన్మకొండ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఆయనకు చెందిన భవితశ్రీ చిట్ ఫండ్ లో సభ్యులుగా చేరి చీటీలు వేసిన వారికి డబ్బులుచెల్లించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాలా మందితో చీటీలు వేయించుకొని దాని సమయం అయిపోయాకకూడా డబ్బులు ఇవ్వకుండా ఏండ్లతరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.కొందరుబాధితులు గతంలోనూ భవిత శ్రీ చిట్ఫండ్తో పాటు మాజీ మేయర్ ఇంటి ముందు నిరసనకు దిగారు. అయినా ఆయన డబ్బులు చెల్లించక పోవడంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రకాశ్ రావును అరెస్ట్ చేసిన అనంతరం వైద్య పరీక్షల కోసం ఎంజేఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కోర్టుకురిమాండ్ చేయనున్నారు.